Google One అదనపు సర్వీస్ నియమాలు

చివరిగా ఎడిట్ చేసినది: 11 నవంబర్, 2025 |

Google Oneను ఉపయోగించాలంటే, మీరు తప్పనిసరిగా (1) Google సర్వీస్ నియమాలను, అలాగే (2) ఈ Google One అదనపు సర్వీస్ నియమాలను (“అదనపు నియమాలు”) అంగీకరించాలి. ఈ అదనపు నియమాలలో నిర్వచించని నియమాలకు Google సర్వీస్ నియమాలలో ఇవ్వబడిన అర్థాలు ఉంటాయి.

దయచేసి ఈ డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా చదవండి. ఈ డాక్యుమెంట్‌లు అన్నింటినీ కలిపి “నియమాలు” అంటారు. మీరు మా సర్వీస్‌లను వినియోగిస్తున్నప్పుడు, మా నుండి ఏమి ఆశించవచ్చు, అలాగే మీ నుండి మేము ఏమి ఆశిస్తాము అనే విషయాలను ఈ సర్వీస్‌లు తెలియజేస్తాయి.

మీ సమాచారాన్ని అప్‌డేట్ చేయడం, మేనేజ్ చేయడం, ఎగుమతి చేయడం ఇంకా తొలగించడం ఎలాగో అర్థం చేసుకోవడానికి మా గోప్యతా పాలసీని చదవమని కూడా మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

1. మా సర్వీస్

Gmail, Google Photos, అలాగే Google Drive అంతటా షేర్ చేసిన పెయిడ్ స్టోరేజ్‌తో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను, Google One అందిస్తుంది, ఇందులో Google లేదా థర్డ్ పార్టీల ద్వారా మీకు అందించబడే అదనపు ప్రయోజనాలతో కూడిన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. Google బిల్ట్ చేసిన కొన్ని AI ఫీచర్‌లకు పెయిడ్ యాక్సెస్ కోసం, Google One, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను, AI క్రెడిట్‌లను కూడా అందిస్తుంది. మీరు అదనపు Google లేదా థర్డ్-పార్టీ ప్రయోజనాలను ఉపయోగించడం అనేది, అటువంటి ప్రయోజనాలకు వర్తించే సర్వీస్ నియమాలకు కట్టుబడి ఉంటుంది. కొన్ని ప్రయోజనాలు అన్ని దేశాలలో అందుబాటులో ఉండకపోవచ్చు, అలాగే ఇతర పరిమితులకు లోబడి ఉండవచ్చు. మరింత సమాచారం కోసం, Google One సహాయ కేంద్రానికి వెళ్లండి.

Google సర్వీస్ నియమాలలో సెట్ చేసిన విధంగా Google ఎంటిటీ ద్వారా Google One సర్వీస్ అందజేయబడుతుంది. మీరు Google One సబ్‌స్క్రిప్షన్ లేదా AI క్రెడిట్‌లను కొనుగోలు చేసినప్పుడు, మీరు విక్రేతతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంటారు, అది Google ఎంటిటీ (విభాగం 2 చూడండి) లేదా థర్డ్-పార్టీ కావచ్చు. మీరు థర్డ్-పార్టీ లేదా అనుబంధ సంస్థ ద్వారా Google One సబ్‌స్క్రిప్షన్‌ను కలిగి ఉంటే, మీ సబ్‌స్క్రిప్షన్ ఆ థర్డ్-పార్టీ లేదా అనుబంధ సంస్థ నుండి వర్తించే అదనపు నియమాలకు లోబడి ఉండవచ్చు.

AI క్రెడిట్‌లు

నిర్దేశిత AI ఫీచర్‌లలో మీ రిక్వెస్ట్‌లను ఎనేబుల్ చేయడానికి, ప్రాసెస్ చేయడానికి మీరు AI క్రెడిట్‌లను ఉపయోగించవచ్చు. ఒక నిర్దిష్ట చర్యకు అవసరమైన క్రెడిట్‌ల సంఖ్య గురించి (ఉదా., వీడియోను జెనరేట్ చేయడం) సంబంధిత ప్రోడక్ట్ లేదా ఫీచర్‌లో మీకు తెలియజేయబడుతుంది. AI ఫీచర్‌లను ఉపయోగించేందుకు అయ్యే క్రెడిట్ ధరను మార్చే హక్కు Googleకు ఉంటుంది. AI క్రెడిట్‌లను, Google ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచే నిర్దిష్ట AI ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి మాత్రమే ఉపయోగించడం సాధ్యపడుతుంది.

మీరు వాటిని పొందిన సమయంలో సెట్ చేసిన విధంగా, ఒక నిర్దిష్ట వ్యవధి తర్వాత AI క్రెడిట్‌ల గడువు ముగియవచ్చు.

ఈ నియమాలలో స్పష్టంగా పేర్కొన్నవి తప్ప, మీకు AI క్రెడిట్‌లలో ఎటువంటి హక్కు లేదా అధికారం ఉండదు. మీరు AI క్రెడిట్‌లను వేరే యూజర్‌కు లేదా ఖాతాకు విక్రయించే, లేదా బదిలీ చేసే అవకాశం ఉండదు, అంతే కాకుండా AI క్రెడిట్‌లను విక్రయించడానికి లేదా బదిలీ చేయడానికి ప్రయత్నించకూడదు. మీరు AI క్రెడిట్‌లను కొనుగోలు చేసినప్పుడు, కొన్ని నిర్దేశించిన AI ఫీచర్‌ల వినియోగానికి ప్రీపేమెంట్ చేస్తారు. AI క్రెడిట్‌లు అనేవి, డిజిటల్ కరెన్సీ, సెక్యూరిటీ, వస్తువు లేదా మరే ఇతర ఆర్థిక సాధనం లాంటివి కాదు కాబట్టి ఏ నగదు విలువకయినా ప్రతిగా వీటిని రిడీమ్ చేయలేము. Google ఎకో-సిస్టమ్‌లో పేర్కొన్న AI ఫీచర్‌లకు సంబంధించి మాత్రమే AI క్రెడిట్‌లను రిడీమ్ చేయగలరు. మీ Google One ప్లాన్‌ను ఉపసంహరించుకున్నప్పుడు లేదా రద్దు చేసినప్పుడు, వర్తించదగిన రీఫండ్ పాలసీలకు లోబడి, ఉపయోగించని AI క్రెడిట్‌లు ఏవైనా ఉంటే వాటిని కోల్పోవచ్చు.

AI క్రెడిట్‌ల గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి.

2. కొనుగోలు, పేమెంట్

Google One సబ్‌స్క్రిప్షన్‌లు నిరవధికంగా కొనసాగుతాయి, మీ సబ్‌స్క్రిప్షన్ నియమాల ప్రకారం, ప్రతి బిల్లింగ్ వ్యవధి ప్రారంభంలో, (ఉదాహరణకు నెలకు, సంవత్సరానికి లేదా మరేదైనా వ్యవధికి) మీకు ఛార్జీ విధించబడుతుంది, ఇది మీరు సబ్‌స్క్రిప్షన్ తీసివేయనంత వరకు ఇలాగే కొనసాగుతుంది.

మీరు Google One సబ్‌స్క్రిప్షన్‌ను లేదా AI క్రెడిట్‌లను కొనుగోలు చేసినప్పుడు, మీ కొనుగోలు, విక్రేత విధించే ప్రత్యేక నియమాలకు లోబడి ఉంటుంది. ఉదాహరణకు, మీరు Google One సబ్‌స్క్రిప్షన్ కోసం సైన్ అప్ చేసినప్పుడు లేదా Google Play Store ద్వారా AI క్రెడిట్‌లను కొనుగోలు చేసినప్పుడు, మీ కొనుగోలు Google Play సర్వీస్ నియమాలకు లోబడి ఉంటుంది.

Google Play Store ద్వారా మీరు కొనుగోలు చేసిన Google One సబ్‌స్క్రిప్షన్ లేదా AI క్రెడిట్‌ల విక్రేత:

  • ఐరోపా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని వినియోగదారుల కోసం: Google Commerce Limited
  • ఇండియాలోని వినియోగదారుల కోసం: Google Ireland Limited
  • ఆసియా, పసిఫిక్‌లోని మిగిలిన వినియోగదారుల కోసం: Google Digital Inc.
  • యునైటెడ్ స్టేట్స్ ఇంకా ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలలోని వినియోగదారుల కోసం: Google LLC.

మీరు థర్డ్-పార్టీ లేదా అనుబంధ సంస్థ ద్వారా Google One సబ్‌స్క్రిప్షన్‌ను లేదా AI క్రెడిట్‌లను కొనుగోలు చేసినప్పుడు, ఆ థర్డ్-పార్టీ లేదా అనుబంధ సంస్థ మీ పేమెంట్ ఆప్షన్‌కు ఛార్జీని విధిస్తుంది, అలాగే రద్దులు, రీఫండ్‌లతో సహా, మీ పేమెంట్‌తో ఏవైనా సమస్యలు ఉంటే, వాటిని మేనేజ్ చేయడానిక బాధ్యత వహిస్తుంది.

విక్రేత Google One సబ్‌స్క్రిప్షన్ కోసం మీకు ఛార్జీని విధించలేకపోతే, మీరు విక్రేతతో మీ పేమెంట్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేసే వరకు Google Oneను యాక్సెస్ చేయలేకపోవచ్చు. నోటీసు తర్వాత నిర్ణీత సమయంలోపు మీరు మీ పేమెంట్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేయకపోతే, మేము Google Oneకు మీ యాక్సెస్‌ను రద్దు చేయవచ్చు లేదా సస్పెండ్ చేయవచ్చు.

3. ధర ఇంకా ఆఫర్‌లు

ఆఫర్‌లు. మేము ఎప్పటికప్పుడు Google One సబ్‌స్క్రిప్షన్ కోసం ఎలాంటి ఛార్జీ విధించకుండా ట్రయల్స్‌ను అందించవచ్చు. మీరు ట్రయల్ ఉన్న Google One సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేస్తే, ట్రయల్ పీరియడ్ అంతటా మీరు Google Oneకు యాక్సెస్‌ను పొందుతారు. ట్రయల్ పీరియడ్ ముగింపులో ఇంకా వర్తించే చట్టం ద్వారా అనుమతించిన మేరకు, మీరు విక్రేతకు చెల్లుబాటు అయ్యే పేమెంట్ ఆప్షన్‌ను అందించినట్లయితే, ప్రతి బిల్లింగ్ వ్యవధిలో మీకు సబ్‌స్క్రిప్షన్ ధర ఆటోమేటిక్‌గా ఛార్జీగా విధించబడుతుంది, అంతే కాకుండా మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఏవైనా ఛార్జీలను నివారించాలంటే, ట్రయల్ పీరియడ్ ముగిసేలోపు మీరు విక్రేతతో మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయాలి. మేము ఎప్పటికప్పుడు Google One సబ్‌స్క్రిప్షన్‌లపై డిస్కౌంట్‌లను కూడా అందించవచ్చు. అర్హత ప్రమాణాలతో సహా, అదనపు నియమాలు, షరతులు ఈ ఆఫర్‌లకు వర్తించవచ్చు అలాగే అటువంటి ఏవైనా అదనపు నియమాలు, రిడీమ్ చేయడానికి లేదా కొనుగోలు చేయడానికి ముందు మీకు అందుబాటులో ఉంచబడతాయి. వర్తించే చట్టం ద్వారా, నిషేధించబడిన చోట లేదా పరిమితం చేయబడిన చోట ఆఫర్‌లు చెల్లవు.

ధరలో మార్పులు. ద్రవ్యోల్బణం, వర్తించే పన్నులలో మార్పులు, ప్రమోషనల్ ఆఫరింగ్‌ల్లో మార్పులు, Google Oneలో మార్పులు లేదా బిజినెస్ అవసరాలలో మార్పులను ప్రతిబింబించడానికి మేము Google One సబ్‌స్క్రిప్షన్‌లను లేదా AI క్రెడిట్‌ల ధరలను ఎప్పటికప్పుడు మార్చవచ్చు. Google One సబ్‌స్క్రిప్షన్‌ల ధరల్లో మార్పులకు, మీ ప్రస్తుత పేమెంట్ ఆప్షన్ పూర్తయిన తర్వాత, ఇంకా నోటీసు తర్వాత మీ నుండి తదుపరి పేమెంట్ గడువు ముగిసినప్పుడు ఈ మార్పులు వర్తిస్తాయి. మీకు ఛార్జీ విధించడానికి కనీసం 30 రోజుల ముందు, ధర పెరుగుదలకు సంబంధించి, మేము ముందస్తు నోటీసును మీకు అందిస్తాము. ఒకవేళ మీకు 30 రోజుల ముందస్తు నోటీసు కంటే తక్కువ సమయంలో నోటీసు ఇస్తే, తదుపరి పేమెంట్ పూర్తయిన తర్వాత, మీరు మళ్లీ పేమెంట్ చేయాల్సి వచ్చేంత వరకు ఆ మార్పు వర్తించదు. మీరు కొత్త ధరకు, మీ Google One సబ్‌స్క్రిప్షన్‌ను కొనసాగించకూడదనుకుంటే, ఈ నియమాలకు సంబంధించిన రద్దుల విభాగంలో పేర్కొన్నట్టుగా మీరు సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవచ్చు, ఈ విషయాన్ని మీరు మాకు ప్రస్తుత బిల్లింగ్ వ్యవధి ముగిసే సమయానికి ముందే తెలియజేస్తే, సబ్‌స్క్రిప్షన్ కోసం తదుపరి ఛార్జీలు మీకు విధించబడవు. ధర పెరిగి, సమ్మతి అవసరమైతే, మీరు కొత్త ధరను అంగీకరిస్తే తప్ప, మీ సబ్‌స్క్రిప్షన్ రద్దు కాదు.

4. రద్దులు, రీఫండ్‌లు

రద్దులు, ఉపసంహరణలు. మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకుంటే, మీరు తక్షణమే రద్దు చేసుకునే హక్కు కలిగి ఉంటే లేదా సహాయ కేంద్రంలో వివరించిన విధంగా ఇతర రద్దు లేదా ఉపసంహరణ హక్కులు కలిగి ఉంటే తప్ప, మీ ప్రస్తుత బిల్లింగ్ వ్యవధిలో మిగిలిన సమయం వరకు Google Oneకు సంబంధించిన యాక్సెస్ మీకు ఉంటుంది. మీకు ఉపసంహరణ హక్కు ఉండి, దానిని వినియోగించుకోవాలనుకుంటే, మీరు కొనుగోలు చేసిన విక్రేతకు స్పష్టమైన స్టేట్‌మెంట్ ద్వారా ఉపసంహరణ నిర్ణయాన్ని తెలియజేయాలి. మీరు ఉపసంహరణ వ్యవధిలో సర్వీస్‌ల పనితీరును ప్రారంభించమని రిక్వెస్ట్ చేస్తే, ఒప్పందం నుండి మీ ఉపసంహరణను విక్రేతకు తెలియజేసే వరకు, అందించిన సర్వీస్‌లకు అనుగుణంగా మీరు ప్రో-రేటెడ్ మొత్తాన్ని పే చేయాల్సి రావచ్చు.

మీరు సర్వీస్ తొలగింపు ద్వారా Google Oneను తొలగించాలని ఎంచుకుంటే, మీరు వెంటనే Google One సర్వీస్‌లకు యాక్సెస్‌ను కోల్పోవడానికి అంగీకరిస్తున్నారని అర్థం. మీ బిల్లింగ్ వ్యవధి ప్రకారం మిగిలి ఉన్న సమయం వరకు, Google One సర్వీస్‌లను మీరు కొనసాగించాలనుకుంటే, Google Oneను తొలగించే బదులు, దయచేసి మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయండి.

రీఫండ్‌లు. మీరు Google One సబ్‌స్క్రిప్షన్‌ను లేదా AI క్రెడిట్‌లను కొనుగోలు చేసినట్లయితే, రీఫండ్ పాలసీ వర్తిస్తుంది. రీఫండ్ కోసం రిక్వెస్ట్ చేయడానికి, మీరు కొనుగోలు చేసిన విక్రేతను సంప్రదించాలి. వర్తించే చట్టం ప్రకారం మీకు వినియోగదారుల హక్కులు ఉండవచ్చు, వాటిని ఒప్పందం ద్వారా పరిమితం చేయలేము. ఈ నియమాలు, ఆ హక్కులను పరిమితం చేయవు.

5. కస్టమర్ సపోర్ట్ విభాగం

కొన్ని నిర్దిష్ట Google సర్వీస్‌ల్లో కస్టమర్ సపోర్ట్‌కు సంబంధించిన యాక్సెస్‌ను Google One చేర్చవచ్చు. మీ రిక్వెస్ట్‌కు సంబంధించి, కస్టమర్ సపోర్ట్ సహాయం చేయలేకపోతే, దానికి వర్తించే Google సర్వీస్ యొక్క కస్టమర్ సపోర్ట్ సర్వీస్‌కు మిమ్మల్ని మేము బదిలీ చేయవచ్చు లేదా మళ్లించవచ్చు. మీ Google One సబ్‌స్క్రిప్షన్, రద్దు గానీ లేదా సస్పెండ్ గానీ అయితే, పరిష్కారం కాని మీ కస్టమర్ సపోర్ట్ సమస్యలు కూడా సస్పెండ్ కావచ్చు, అంతే కాకుండా మీ సబ్‌స్క్రిప్షన్‌ను పునరుద్ధరించిన తర్వాత, కొత్త ఎంక్వైరీ ఫారమ్‌ను సమర్పించాల్సి రావచ్చు. కస్టమర్ సపోర్ట్ గురించిన మరింత సమాచారం కోసం, దయచేసి మా సహాయ కేంద్రానికి వెళ్లండి.

6. ఫ్యామిలీ షేరింగ్

మీ Google One సబ్‌స్క్రిప్షన్, మీ ఫ్యామిలీ గ్రూప్‌తో (“ఫ్యామిలీ షేరింగ్”) కొన్ని ప్రయోజనాలను షేర్ చేసుకోవడానికి మిమ్మల్ని అనుమతించవచ్చు. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ గ్రూప్‌తో ఎలాంటి ప్రయోజనాలను షేర్ చేయకూడదనుకుంటే, Google One కోసం ఫ్యామిలీ షేరింగ్‌ను డిజేబుల్ చేయాలి లేదా మీ ఫ్యామిలీ గ్రూప్ నుండి నిష్క్రమించాలి. కేవలం, Google One ప్లాన్ మేనేజర్‌లు మాత్రమే Google One సబ్‌స్క్రిప్షన్‌కు ఫ్యామిలీ మెంబర్‌లను జోడించగలరు, అందులో ఫ్యామిలీ షేరింగ్‌ను ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయగలరు. ఫ్యామిలీ షేరింగ్ గురించిన మరింత సమాచారం కోసం, దయచేసి మా సహాయ కేంద్రానికి వెళ్లండి.

మీరు Google Oneలోని ఫ్యామిలీ గ్రూప్‌లో భాగమైతే, మీ ఫ్యామిలీ గ్రూప్‌లోని మెంబర్‌లు మీ గురించిన నిర్దిష్ట సమాచారాన్ని చూడగలరు. ఉదాహరణకు, మీరు Google One ఫ్యామిలీ షేరింగ్ ఎనేబుల్ చేసిన ఫ్యామిలీ గ్రూప్‌లో చేరితే, ఫ్యామిలీ గ్రూప్‌లోని ఇతర మెంబర్‌లు (మరియు ఆహ్వానితులు), మీ పేరును, ఫోటోను, ఈమెయిల్ అడ్రస్‌ను, మీరు బ్యాకప్ చేసిన డివైజ్‌లను, వినియోగించిన AI క్రెడిట్‌లను ఇంకా మీరు ఉపయోగిస్తున్న స్టోరేజ్ స్పేస్ మొత్తాన్ని చూడవచ్చు. Google One సబ్‌స్క్రిప్షన్‌తో చేర్చిన కొన్ని అదనపు ప్రయోజనాలను ఫ్యామిలీ మెంబర్ రిడీమ్ చేసుకున్నారా లేదా అనే దాన్ని కూడా ఫ్యామిలీ గ్రూప్ మెంబర్‌లు చూడవచ్చు.

మీరు మీ ఫ్యామిలీ గ్రూప్‌లో, Google One ప్లాన్ మేనేజర్ అయితే, అలాగే మీరు ఫ్యామిలీ షేరింగ్‌ను డిజేబుల్ చేస్తే, లేదా మీ ఫ్యామిలీ గ్రూప్ నుండి వెళ్లిపోతే, మీ ఫ్యామిలీ గ్రూప్‌లోని ఇతర మెంబర్‌లు, Google One సబ్‌స్క్రిప్షన్‌కు యాక్సెస్‌ను కోల్పోతారు. మీకు మీ Google One ప్లాన్ మేనేజర్ ద్వారా ఫ్యామిలీ షేరింగ్‌తో Google Oneకు యాక్సెస్ మంజూరు చేసి ఉంటే, మీరు మీ ఫ్యామిలీ గ్రూప్ నుండి వెళ్లిపోయినా లేదా మీ Google One ప్లాన్ మేనేజర్ ఫ్యామిలీ షేరింగ్‌ను డిజేబుల్ చేసినా లేదా ఫ్యామిలీ గ్రూప్ నుండి వెళ్లిపోయినా, మీరు Google Oneకు యాక్సెస్‌ను కోల్పోతారు.

7. మొబైల్ బ్యాకప్, రీస్టోర్

Google One, అర్హత గల మొబైల్ డివైజ్‌ల్లో, విస్తరించిన డేటా బ్యాకప్‌ను, ఇంకా రీస్టోర్ ఫంక్షనాలిటీ ("బ్యాకప్, రీస్టోర్")ని కలిగి ఉండవచ్చు. బ్యాకప్, ఇంకా రీస్టోర్‌ను ఉపయోగించడం కోసం, Google Photos లాంటి అదనపు అప్లికేషన్‌ల ఇన్‌స్టాలేషన్, ఇంకా యాక్టివేషన్ అవసరం ఉంటుంది. మీరు Google One అప్లికేషన్‌లో ఎప్పుడైనా మీ బ్యాకప్ ఇంకా రీస్టోర్ ఆప్షన్‌లను మార్చవచ్చు. మీ Google One సబ్‌స్క్రిప్షన్ సస్పెండ్ అయినా లేదా రద్దు అయినా, Android బ్యాకప్ పాలసీలకు అనుగుణంగా, కొంతకాలం తర్వాత బ్యాకప్, ఇంకా రీస్టోర్‌లో సేవ్ చేసిన డేటాకు మీరు యాక్సెస్‌ను కోల్పోవచ్చు.